306 మంది ప్రయాణీకులతో ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-2030 విమానం ఉదయం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే ఫ్లైట్ గాల్లో ఉండగానే అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు స్క్వాక్ 7500 కోడ్ వచ్చింది. అయితే సాధారణంగా విమానం హైజాక్కు గురైనప్పుడు లేదా తీవ్ర ముప్పు ఏదైనా ఉన్నప్పుడు ఈ సిగ్నల్ వెళ్తుంది. హైజాక్ హెచ్చరికలు అందిన వెంటనే భద్రతాదళాలు,ఢిల్లీకి బదులుగా జైపూర్ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు.