సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. కిడ్నీలో స్టోన్ సమస్యతో ఈ నెల 6న మెడికవర్ హాస్పిటల్లో 28 ఏళ్ల అడ్వకేట్ ఐశ్వర్య చేరింది. వారం రోజుల పాటు చికిత్స అందించిన అనంతరం ఆమె మెదడు (బ్రెయిన్) 80 శాతం డెడ్ అయినట్లు ఐశ్వర్య కుటుంబ సభ్యులకు హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది. హాస్పిటల్ వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐశ్వర్య బంధువులు,సహచర సీనియర్ అడ్వకేట్లు ఆందోళనకు దిగారు. ఎల్ఎల్బిలో గోల్డ్ మెడల్ సాధించిన ఐశ్వర్యకు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది.