మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నడుమ కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తమిళనాడులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనను పూర్తిగా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేయాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తమిళనాడులో బీజేపీ జెండాను ఎగరవేయడానికి, పార్టీని గ్రామస్థాయిలో ప్రజలకు చేరువ చేయడానికి రాష్ట్ర బాధ్యతలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం