ప్రముఖ యూట్యూబర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ధృవ్ రాఠీని ఢిల్లీ పోలీసులు ఈ వేకువజామున విడుదల చేశారు. పోలీసులు తనను చట్టబద్ధంగా అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. కిడ్నాప్ చేశారని విమర్శించారు. గుర్గామ్ సెక్టార్ 56 లో ఉన్న తన నివాసానికి శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో దాదాపు 20 మంది మఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చి తనను బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా గానీ, సమాజంలో జరుగుతోన్న అన్యాయాలను ప్రశ్నించిన వాళ్లందరూ కూడా విదేశీయులే అవుతారా అని నిలదీశారు.