ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. కమ్జోంగ్, ఉర్ఖల్ జిల్లాలో శనివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో నివాసాలు, దుకాణాలకు నిప్పంటించగా.. కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో ఇటీవల నాగాలు, కుకి-జో వర్గాల మధ్య హింస చెలరేగడంతో గిరిజన ఐక్యతా కమిటీ (CoTU) శనివారం సాయంత్రం 6 గంటల నుంచి కాంగ్పోక్పి జిల్లా వ్యాప్తంగా 24 గంటల బంద్కు పిలుపునిచ్చింది. సాయుధ బృందాలు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 23 ఏళ్ల మైఖేల్ అనే యువకుడు మృతిచెందాడు.