త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశిస్తూ పూనమ్ కౌర్ తన ఇన్ స్టా స్టోరీలో సంచలన వ్యాఖ్యలు చేసింది… తన కుటుంబ సభ్యుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారి ద్వారా తనకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇప్పించారని పూనమ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి నేను కట్టుబడి లేను. రాజకీయ నాయకులు చేసిన తప్పులకు తమ కుటుంబం ఎందుకు జవాబుదారీ అని ప్రశ్నించింది. సమస్య వచ్చినప్పుడు పారిపోయి, మళ్లీ తమ అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొంది..