సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో సీజేపీ చేపట్టిన జంతర్ మంతర్ 2.0 ఆందోళనతో ఢిల్లీ లోపల బయట రణరంగంలా మారింది. జంతర్ మంతర్ వెళ్లేందుకు వేల సంఖ్యలో కాక్రోచ్ పార్టీ మద్దతు దారులు క్రమక్రమంగా ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది నిరసనకారులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. జంతర్ మంతర్ లో నిరసనకు వస్తున్న ఆందోళన కారులను, కాక్రోచ్ పార్టీ మద్దతు దారులను ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు పోలీసులు. ముళ్ల కంచెలు, సిమెంట్ దిమ్మెలతో కాక్రోచ్ లను అడ్డుకుంటున్నారు.