యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని షార్జా యాంకరేజ్ వద్ద పనామా జెండా కలిగిన క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ‘MT GEM NO. 2’ పై డ్రోన్ దాడి జరిగినట్లు వెల్లడైంది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న మొత్తం 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 9న ఈ ఘటన జరగగా, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. నావికుల భద్రత కోసం షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.