ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు పిలుపునివ్వడంతో దిల్లీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దిల్లీలోని 15 జిల్లాల పరిధిలో 30 నుంచి 40 మంది నేరచరిత్ర కలిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.దిల్లీ సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బస్టాండ్లు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ధర్మశాలల్లో సోదాలు చేపట్టారు. ఆందోళనలకు జనసమీకరణ చేసే అవకాశమున్న దాదాపు 200 మంది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లపై నిఘా ఉంచారు.