ఏపీ కేబినెట్ రేపు(శనివారం) ప్రత్యేకంగా సమావేశంకానుంది. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరుగనుంది. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవోలను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌పై చర్చించేందుకు కేబినెట్ సమావేశమవనుంది. కమిషన్ నివేదికను మంత్రివర్గం పరిగణలోకి తీసుకోనుంది. బీసీలకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్స్ చేసిన రిజర్వేషన్లు, జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించనున్నట్లు సమాచారం.