కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణ విజయన్, అల్లుడు, ప్రస్తుత మంత్రి మహమ్మద్ రియాస్‌కు సంబంధించిన ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించినట్లు పేర్కొంది. ఈడీ వాదన ప్రకారం, కొన్ని లావాదేవీలకు సంబంధించిన సమాచారం, ఆధారాలు తమ దర్యాప్తులో లభించాయి. వాటి ఆధారంగా కేరళ పోలీసులకు సమాచారం అందించి, సంబంధిత వ్యక్తులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరింది.