నోబెల్ శాంతి బహుమతి 2026 సంవత్సరానికి గాను దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్ నవీ పిళ్లైను వరించింది. శాంతి, అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల కోసం ఆమె చేసిన కృషికి ఈ పురస్కారం దక్కింది. ఆమె దక్షిణాఫ్రికాలో జన్మించారు. నవనీతమ్ పూర్వీకులు భారత్ లోని తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. 2008-14 మధ్య UNO హ్యూమన్ రైట్స్ హైకమిషనర్ గా ఆమె పనిచేశారు. 2025లో వెనెజువెలాకు చెందిన మరియా కొరీనాకు నోబెల్ శాంతి పురస్కారం లభించిన సంగతి తెలిసిందే.