పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) ప్రోగ్రామ్ నిషేధం నేపథ్యంలో అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చి, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జోహో (Zoho) సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు పిలుపునిచ్చారు. ‘అమెరికాలో వీసాపై ఉన్న భారతీయులు ఎంతో కష్టపడి నిర్మించుకున్న జీవితాలను వదిలి రావాల్సి రావడం బాధాకరమైన
విషయమే.. కానీ ఒక శక్తివంతమైన, నూతన భవిష్యత్తుకు ఇది ఆరంభం కావచ్చు. స్వదేశానికి తిరిగి రండి, మన భారతదేశాన్ని కలిసి నిర్మిద్దాం’’ అని వేంబు పిలుపునిచ్చారు.