హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై అర్ధరాత్రి వేడుకలు నిర్వహించడంపై పోలీసు శాఖ తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారితో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పై అర్ధరాత్రి వేడుకలు జరపకూడదని అధికారులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్ లు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాల మీదికి వస్తోంది.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనలు తెచ్చారు.