స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. చట్టపరంగా ఇబ్బందులు ఎదురైనా తెదేపా పరంగా బీసీలకు సముచిత రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్థసారథి మీడియాతో మాట్లాడారు.”బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పింది. రిజర్వేషన్లు ఇవ్వొద్దని చెప్పలేదు. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయి.
బీసీ గణనను త్వరగా పూర్తిచేసి ఆమోదించి రిజర్వేషన్లు కల్పిస్తాం.