ఇండీయా కూటమి ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో చలో లోక్‌భవన్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో చేపట్టింది. నెక్లెస్‌రోడ్ నుంచి లోక్‌భవన్ వరకు భారీ ప్రదర్శనగా నేతలు వెళ్తున్నారు. భారీ ప్రదర్శనలో సీఎం రేవంత్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ నిరసనలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చలాంటిదంటూ ఆయన ఖండించారు.