భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు అనుమతులు ఆలస్యం కావడంపై ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మస్క్ వ్యాఖ్యలు “ఆధారరహితమైనవి, తప్పుదారి పట్టించేవి” అని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. స్టార్‌లింక్‌తో పాటు రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మద్దతుతో ఉన్న వన్‌వెబ్ ఈ మూడు సంస్థల భద్రతా పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోందని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్పెక్ట్రమ్ కేటాయింపు తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.