భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీపై టెక్ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను కొంతమంది కుబేరులు అడ్డుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ప్రజలపై ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించేందుకే స్టార్‌లింక్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. అంతేకాదు.. ఇది భారత ప్రజల పట్ల జరుగుతున్న నేరం.. ఆ కుబేరులెవరో మీరే ఊహించండి అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.భారత్‌పై ఉన్న Starlink శాటిలైట్ బీమ్స్ ఆఫ్‌లో ఉన్నాయని, అందువల్ల భారత్‌లో Starlink సేవలు అందుబాటులో లేవని స్పష్టం చేశారు.