ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఎస్ఐఆర్ సర్వే మళ్లీ మొదలు కానుంది. ఇటీవలే జరిగిన ఎస్ఐఆర్ తర్వాత తొలగించిన ఓటర్ల జాబితాను మరోసారి వెరిఫికేషన్ చేయనున్నారు అధికారులు. ఎస్ఐఆర్ గణనలో 44 లక్షల 89 వేల 512 మంది ఓటర్లు అందుబాటులో లేరన్నారు.
46 లక్షల 62 వేల 583 మంది తొలగించిన ఓటర్ల జాబితాతో ఇంటింటికీ బీఎల్ఓలు వెళ్తారని చెప్పారు. పొరపాటున పేరును తొలగిస్తే ఫారం-6తో మళ్లీ నమోదు చేసుకోవచ్చని సూచించారు.