ఓటర్ల జాబితాలోని రికార్డుల్లో తప్పులు, సాంకేతిక లోపాలు వంటి వివిధ కారణాల రీత్యా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92.88 లక్షల నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 91.92 లక్షల నోటీసులు నేరుగా ఓటర్లకు చేరవేశారు. అక్టోబర్ 7వ తేదీతో క్లెయిమ్లు మరియు అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఈ వచ్చిన అభ్యంతరాలన్నింటినీ నవంబర్ 5వ తేదీలోగా పరిశీలించి పరిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత నవంబర్ 9వ తేదీన అధికారికంగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.