“ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ అద్భుతమైన మైలురాయి. సరైన సమయంలో.. సరైన స్థానం.. సరైన నాయకుడు ఉండటం మన దేశ అదృష్టం. ఆయన దార్శనిక నాయకత్వంలో ‘వికసిత్ భారత్ @2047’ దిశగా భారత్ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తోంది. ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా. 25 సంవత్సరాల అంకితభావంతో కూడిన ప్రజా సేవను పూర్తి చేసుకున్న మోదీకి హృదయపూర్వక అభినందనలు. ఒక తరం దిశను నిర్దేశించే అవకాశం కొద్దిమంది నాయకులకే లభిస్తుంది.
అలాంటి నాయకుల్లో మోదీ ఒకరు” అని చంద్రబాబు పేర్కొన్నారు.

