2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానం ప్రారంభమైంది.గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి మోదీ, 2014లో భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. అక్కడితో ఆగకుండా 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించి, వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు.
ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వాధినేతగా పాతికేళ్లపాటు భారత రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన మరియు విశేషమైన మైలురాయిగా నిలిచింది.

