తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పెద్దపులి సంచరింస్తుందనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు తాళ్లపూడి మండలం తుపాకులగూడెం, రాగోలపల్లి, గోపాలపురంమండలం గోపవరం తదితర కొండ, పంటపొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలిసింది. దీంతో
తెల్లవారు జామునే పంటపొలాలకు వెళ్లే రైతులు, కూలీలను అటువైపునకు వెళ్లేదంటూ డప్పు చాటింపు వేయించారు

