ఏపీలో గూఢచర్యం వ్యవహారం కలకలం రేపుతోంది. ఆపరేషన్ ఫైర్వాల్తో భారీ కుట్ర బయటపడింది. పాకిస్థాన్ కు రక్షణ రహస్యాలు చేరవేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఆపరేషన్ ఫైర్ వాల్-2026’ పేరిట ఏపీ సీఐ సెల్ సంచలన ఆపరేషన్ చేపట్టింది. 13 మంది నావికాదళ సిబ్బంది సహా 18 మంది వ్యక్తులపై నిఘా ఉంచింది. ఈనెల 1న 12 ప్రత్యేక బృందాలతో మెరుపుదాడి చేసింది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృతంగా సోదాలు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసింది.

