తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి కిలో ఉల్లి ధర రూ.80కి చేరింది. జులైలో రూ.20-25గా ఉన్న ధర ప్రస్తుతం రూ.75-80కు పెరిగింది. మార్కెట్ లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ధరల పెరుగుదలతో హోటళ్లు అలాగే టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ఉల్లి వినియోగాన్ని తగ్గించారు. కొన్ని చోట్ల ఉల్లిదోశను పూర్తిగా నిలిపివేశారు. కూరగాయల ధరలు భారీగా ఎగబాకడంతో సామాన్య కుటుంబాల
బడ్జెట్ తలకిందులవుతోంది.