ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం భౌగోళిక గుర్తింపుపై ప్రముఖ డిజిటల్ నేవిగేషన్ ప్లాట్ఫామ్ ‘గూగుల్ మ్యాప్స్’లో గత కొంతకాలంగా నెలకొన్న తీవ్ర అయోమయానికి ఎట్టకేలకు తెరపడింది. గతంలో గూగుల్ మ్యాప్స్లో భద్రాచలం ప్రాంతాన్ని వెతికినప్పుడు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లు చూపించేది. నెటిజన్లు, స్థానికులు అందించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పరిశీలించిన గూగుల్ యాజమాన్యం తాజాగా తమ మ్యాప్స్ డేటాను సవరించింది. ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్లో భద్రాచలాన్ని తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్నట్లు అధికారికంగా, స్పష్టంగా చూపుతోంది.

