రోడ్డు ప్రమాదంలో మంత్రి డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో జరిగింది. తన్నీరు శ్రీహరి అనే వ్యక్తి ఎపి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వద్ద డ్రైవర్గా పని చేస్తున్నాడు. చిలకలూరిపేట నుంచి చెరువు రోడ్డు వైపుకు బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.