అంతర్జాతీయ వేదికపై తెలుగు మహిళ, అరకు వైసీపీ ఎంపీ గుమ్మ తనుజారాణి తన గళాన్ని వినిపించారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) సాధారణ సభ 81వ సెషన్లో భాగంగా జరిగిన పరిపాలన, బడ్జెట్ కమిటీ (ఐదవ కమిటీ) మొదటి అధికారిక సమావేశంలో ఆమె భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రసంగించారు. ఈ కీలక సమావేశంలో ఆమె ఐరాస పనితీరు, ఆర్థిక స్థిరత్వం, సంస్కరణల ఆవశ్యకతపై భారత వాదనలను బలంగా వినిపించారు. ఈ సందర్భంగా తనుజారాణి మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల ప్రక్రియను నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.