స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లు భేటీ అయ్యారు. కూటమి పార్టీల మధ్య స్థానాల సర్దుబాటుపైనా, ఎవరు ఏఏ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపైనా చర్చ జరుగుతోంది. అలాగే ఎన్నికల కార్యాచరణ కూటమి సమన్వయం పైనా నేతలు
మాట్లాడుకుంటున్నారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ అల్పాహార విందులో పాల్గొన్నారు.