ఢిల్లీ వేదికగా INDIA కూటమి ఎంపీలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్ మకార్ ద్వార్ నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) కార్యాలయం వైపు బయలుదేరిన ఎంపీలు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మార్చ్ లో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాల ఎంపీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

