రష్యా సైబీరియాలో ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే 28 ఏళ్ల దర్యా షిపిలోవా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మృతి చెందారు. ఆమెకు తీవ్రమైన న్యూమోనియా లక్షణాలు కనిపించడంతో చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆమెకు ప్లేగు సోకిందా? ల్యాబ్లో ఏదైనా ప్రమాదం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. సోషల్ మీడియాలోనూ ఈ అనుమానాలు మరింత వేగంగా వ్యాపించాయి. ల్యాబ్లో ప్లేగు బ్యాక్టీరియాతో కూడిన నమూనా ప్రమాదవశాత్తూ బయటకు వచ్చిందనే ప్రచారం కూడా జరిగింది.