SIR ప్రక్రియలో భాగంగా సమర్పించే ఫామ్-6, 6A, 7 మరియు 8 దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం లేదా అసత్య ప్రకటనలు ఇస్తే చట్టపరమైన తీవ్ర చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సరైన కారణాలు లేనివి, దరఖాస్తుదారు వివరాలు సరిగా లేనివి మరియు సంతకాలు లేని నకిలీ బల్క్ ఫామ్లను తక్షణమే తిరస్కరిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో దరఖాస్తులు చేసిన వారిపై ప్రాసిక్యూషన్ చేపడతామని స్పష్టం చేశారు.

