ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఏసీపీ వివేక్ భగత్ ప్రమోషన్ పొందారు. ఆయనను అదనపు డీసీపీగా ప్రమోట్ చేస్తూ ఉన్నతాధికారులు ఈరోజు (సోమవారం) ఆదేశాలు జారీ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ‘నిరసన చేస్తున్న మహిళలను అడ్డుకోవడానికి పోలీసులు వచ్చారు. అయితే వారిలో మహిళా పోలీసులు ఒకరు కూడా లేరు. దీనిపై నేను ఏసీపీ వివేక్‌ను ప్రశ్నించాను. బదులుగా ఆయన నాపై లైంగిక దాడి చేశారు’ అని ఓ మహిళ ఆరోపించారు.

