ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ షూటింగ్ లో అపశ్రుతి జరిగింది. సోమవారం (అక్టోబర్ 05) సాయంత్రం ఫిల్మ్ సిటీలోని రిలయన్స్ మీడియా వర్క్స్, ప్రైమ్ ఫోకస్ వెనుక భాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రైమ్ ఫోకస్ స్టూడియో వెనుక ఉన్న వంద అడుగుల తాత్కాలిక సెట్లోని పీసీఆర్ యూనిట్లో ఈ మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ వైరింగ్, కేబుల్స్, తలుపులు, చెక్కపలకలు, ఏసీ యూనిట్లు, బాంబులు, ప్లాస్టిక్ సామగ్రి, సౌండ్ సిస్టమ్స్, షూటింగ్ పరికరాలు ఈ అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యాయని తెలుస్తోంది.

