ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్ల మంజూరు అంశం అధికార కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వం కొత్త దరఖాస్తులను ఆహ్వానించడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13.65 లక్షల అప్లికేషన్లు వచ్చి పడ్డాయి. ప్రభుత్వ ఖజానాపై ప్రతినెలా రూ. 2,700 కోట్లకు పైగా భారం పడుతోంది. కొత్త పింఛన్లు ఇవ్వడం అనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం సాధ్యంకాని పని. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ‘పింఛన్ల చిక్కుముడి’ని ప్రభుత్వం ఎలా విప్పుతుందనేది ఆసక్తికరంగా మారింది.

