ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువగా అమ్మాయిలకు సంబంధించిన ప్లాట్‌ఫామ్ అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.దీంతో ‘ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిలదైతే.. ఎక్స్ ఎవరిది?’ అంటూ కొందరు నెటిజన్లు మస్క్‌ను ప్రశ్నిస్తున్నారు.ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌ను ‘ఫీమేల్ యాప్’గా పేర్కొంటూ తాను ఆ యాప్‌ను డిలీట్ చేసినట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్.. ‘ఇన్‌స్టాగ్రామ్ గర్ల్స్ కోసమే’ అంటూ రిప్లై ఇచ్చారు.