కెనడాకు చెందిన ప్రముఖ ‘లాటిట్యూడ్ ఎయిర్ అంబులెన్స్’ సంస్థకు చెందిన గల్ఫ్‌స్ట్రీమ్ G100 విమానం అమెరికా తీర ప్రాంతంలో అకస్మాత్తుగా అదృశ్యమవడం కలకలం సృష్టించింది.ఈ మెడికల్ విమానంలో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది, ఒక రోగి మరియు ఆ రోగికి చెందిన కుటుంబ సభ్యుడు ఉన్నారు. బెర్ముడాలోని ఎల్.ఎఫ్. వేడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోస్టన్లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం బయలుదేరింది.