కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ.. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే.. ఈ నిరసనలకు పిలుపు నిచ్చారు.పోలీసుల ఆంక్షలపై అభిజిత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి నాడు ఆయన చూపించిన అహింసా మార్గంలోనే తాము నిరసన చేపట్టాలని భావించామని అన్నారు. అయితే.. పోలీసులు అహింసాయుత నిరసనపైనే ఉక్కుపాదం మోపారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తమ ఉద్యమం, నిరసన ఆగబోదని అన్నారు.