ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్‌లో ఎదురైన ప్రాణాంతక దాడిని అత్యంత సాహసంతో ఎదుర్కొని, 174 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్‌లో సంభాషించారు. ప్రస్తుతం యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ యోగక్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఆయన ప్రదర్శించిన అసామాన్య ధైర్యసాహసాలను ప్రశంసించిన ప్రధాని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రధాని స్వయంగా ఫోన్ చేయడంతో కెప్టెన్ స్మిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.