భారతీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ టెక్నాలజీ అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత చాటుకునేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వెళుతోంది.దేశంలో యాపిల్ ఐఫోన్ల తయారీ నుంచి అత్యంత కీలకమైన సెమీకండక్టర్ చిప్స్ ఉత్పత్తి వరకు అన్ని విభాగాల్లోనూ టాటా ఎలక్ట్రానిక్స్ దూసుకుపోతోంది.
ఈ వ్యాపారాన్ని వేగంగా విస్తరించాలనే ఉద్దేశంతో కంపెనీ తన పెట్టుబడులను భారీగా పెంచేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన పెట్టుబడులను ఏకంగా మూడు రెట్లు పెంచినట్లు స్పష్టమైంది.