వినాయక చవితి నవరాత్రుల ముగింపు సందర్భంగా నిర్వహించే గణేష్ నిమజ్జనం వేడుకల్లో డీజేల హోరు శృతి మించుతుండటం చూస్తూనే ఉన్నాం.మితిమీరిన శబ్ద కాలుష్యం కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పసిపిల్లలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది నిత్యం వినబడే వాదనే.ఇదే విషయంపై గళమెత్తిన నటి రేణూ దేశాయ్ తీవ్ర సైబర్ దాడులకు, ట్రోలింగ్‌కు గురయ్యారు.సమాజ హితం కోరి ఆమె చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన కొందరు నెటిజన్లు, ఏకంగా ఆమెను ‘చచ్చిపో’ అంటూ దారుణమైన పదజాలంతో దూషించడం కలకలం రేపుతోంది.

