ఒక వ్యక్తి వెనుక గిటార్ తగిలించుకుని స్కూటీ డ్రైవ్ చేశాడు. అయితే ఆ గిటార్‌ను వెనుక కూర్చొన్న వ్యక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ కెమెరా పొరపాటుపడింది. దీంతో స్కూటీ వెనుక కూర్చొన్న వ్యక్తి హెల్మెట్ ధరించనందుకు రూ.500 జరిమానా విధించారు.కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఏఐ ట్రాఫిక్ కెమెరా తీసిన ఫొటో, జారీ చేసిన జరిమానాను ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ ఉల్లంఘనల గుర్తింపు అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.