బండ్ల గణేష్ ఒక నిర్మాత కాబట్టి.. సినిమా తీస్తే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతోనే ఆయన పవన్‌ను అలా పొగుడుతుంటారని పేర్ని కిట్టు ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యల పైన బండ్ల గణేష్ ” పవన్ గారు ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏంటో నీకు అన్నీ అర్థమయ్యేలా త్వరలో చెప్తా తమ్ముడు పేర్ని కిట్టి….!! అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు ఇటు వైసీపీ అటు జనసేన శ్రేణులు స్పందిస్తున్నారు.