ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నానికి రష్యా మరోసారి బహిరంగ మద్దతు ప్రకటించింది. అదే సమయంలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా జర్మనీ, జపాన్లకు అదనపు శాశ్వత స్థానాలు కల్పించడాన్ని రష్యా వ్యతిరేకించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, భద్రతా మండలి సంస్కరణలు ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలని అన్నారు.