టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేటస్ AI సాంకేతికతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఏఐ టెక్నాలజీ గనుక తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే, అది మానవాళికి కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఏఐ కారణంగా దాదాపు 100 కోట్ల మంది మరణించే అత్యంత ప్రమాదకరమైన విపత్తు సంభవించే అవకాశం ఉందని ఆయన అమెరికన్ మీడియా ఇంటర్వ్యూలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఏఐ స్వయంగా దానంతట అదే మానవాళిని అంతం చేస్తుందని తాను నమ్మనని బిల్‌గేట్స్ స్పష్టం చేశారు.