ఖైరతాబాద్ బడా గణేశుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఏడాది 69 అడుగుల ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ గా గణనాథుడు దర్శనమిచ్చాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకున్న బడా గణేశుడికి ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు హుస్సేన్నాగర్లో భారీ క్రేన్ల సాయంతో నిమజ్జన ప్రక్రియను పూర్తిచేశారు.