ఏషియన్ గేమ్స్ 2026 ఏడవ రోజు భారత్కు రెండో స్వర్ణ పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్లో సరుచి, కమల్జిత్ జోడీ గోల్డ్ మెడల్ సాధించి రికార్డు సృష్టించింది. అలాగే 50 మీటర్ల రైఫిల్ విభాగంలో సిల్వర్ మెడల్ లభించింది ఈ తుది పోరులో కమల్జీత్, సురుచి సింగ్ జోడీ మొత్తం 484.4 పాయింట్ల స్కోరు సాధించి సరికొత్త ఏషియన్ రికార్డును సృష్టించింది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ ఆటగాళ్ల పేరిట ఉన్న 481.3 స్కోరు రికార్డును మన క్రీడాకారులు బద్దలు కొట్టడం విశేషం.