ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఎన్టీఆర్ బేబీ కిట్ల’ పథకాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ప్రసవం జరిగే తల్లులకు నవజాత శిశువుల సంరక్షణ కోసం బేబీ కిట్లను అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకానికి ఏడాదికి సుమారు రూ.51.15 కోట్ల నిధులను కేటాయించారు. ఒక్కో ఎన్టీఆర్ బేబీ కిట్‌కు రూ.1,410 ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవించిన తల్లులకు నవజాత శిశువు సంరక్షణ కోసం ఈ కిట్లను అందించనున్నారు.