ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదంలో మరో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. దాంతో రిమ్స్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరిందని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి ఏసీ పేలడంతో వెంటనే మంటలు అంటుకుని దట్టమైన పొగలు చిన్నారుల విభాగంలో వ్యాపించాయి. మంటలకు గాయపడిన చిన్నారులు, పొగ పీల్చి అస్వస్థతకు గురైన చిన్నారులను ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మంగళవారం చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోగా, బుధవారం ఉదయం మరో ఇద్దరు శిశువులు చనిపోవడంతో మరింత విషాదం నెలకొంది.