పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీలకు గైర్హాజరు కావడం, సీఎం చంద్రబాబు కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతుండటంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న చర్చ నడుస్తోంది. కేబినెట్ భేటీ కోసం సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ .. సీఎంతో కలిసి మంత్రివర్గ సమావేశం జరిగే ఛాంబర్ కు వచ్చారు. దారిలో ఇద్దరూ ఉత్సాహంగా మాట్లాడుకుంటూ కనిపించారు. చాలా కాలం తర్వాత పవన్ రావడంతో ఆయన ఆరోగ్యంతో పాటు ఇతర అంశాలపై సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లు తెలుస్తోంది. అనంతరం కేబినెట్ భేటీలోకి వెళ్లి పవన్ కళ్యాణ్ తన సీట్లో కూర్చున్నారు.